ఎమ్మెల్యే గణేష్ గుప్తాను పరామర్శించిన సీఎం కేసీఆర్

X
Highlights
సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి ...
Arun Chilukuri2 Dec 2020 10:22 AM GMT
సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. కృష్ణమూర్తి చిత్రపటానికి నివాళులర్పించిన కేసీఆర్.. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సీఎం తో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మంత్రులు హరీష్ రావ్, ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, ఎంపీలు సురేష్ రెడ్డి, బిబి పాటిల్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్దన్ తదితరులు కూడా గణేష్ గుప్తా ను పరామర్శించారు. అనంతరం కృష్ణమూర్తి స్మారక ప్రకృతి వనాన్ని సీఎం ప్రారంభించారు.
Web TitleCM KCR meets MLA Ganesh Gupta family in Nizamabad Makluru
Next Story