ఆర్టీసీ చరిత్రలో నూతనాధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్న తెలంగాణ సర్కార్

ఆర్టీసీ చరిత్రలో నూతనాధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్న తెలంగాణ సర్కార్
x
కేసీఆర్‌
Highlights

ఆర్టీసీ కార్మికుల కథ సుఖాంతమైంది. ఓ వైపు విధుల్లోకి చేరిన కార్మికులతో డిపోలు కిటకిటలాడగా మరోవైపు ఆర్టీసీ కార్మికుల కోసం సీఎం కేసీఆర్‌ సరికొత్త ఆలోచన...

ఆర్టీసీ కార్మికుల కథ సుఖాంతమైంది. ఓ వైపు విధుల్లోకి చేరిన కార్మికులతో డిపోలు కిటకిటలాడగా మరోవైపు ఆర్టీసీ కార్మికుల కోసం సీఎం కేసీఆర్‌ సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సంస్థ భవితవ్యం కార్మికుల సంక్షేమం రెండింటీ భవిష్యత్ తేల్చేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. నష్టాల్లో మగ్గిపోతున్న ఆర్టీసీని లాభాల బాటపట్టించేందుకు కార్యచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ చరిత్రలో నూతనాధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ఆర్టీసీలో యూనియన్లు అనేవి లేకుండా చేసేందుకు సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె ప్రభావంతో సీఎం కేసీర్ పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. 52రోజుల పాటు అటు ప్రజలను ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేసిన ఆర్టీసీ కార్మికుల సమస్యకు ఎట్టకేలకు ఫుల్‌స్టాప్ పెట్టిన కేసీఆర్‌ అంతర్గత సమస్యలపై దృష్టి సారించారు. సంస్థలో ఉన్న వాస్తవ పరిస్థితులను కార్మికులతో నేరుగా తానే మాట్లాడేందుకు సన్నద్దమయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 97 డిపోలకు చెందిన వారిని సమావేశానికి ఆహ్వానించారు. ప్రతీ డిపో నుంచి వచ్చే ఐదుగురు కార్మికుల్లో కచ్చితంగా ఇద్దరు మహిళలు ఉండాలని అన్ని వర్గాల కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మను ఆదేశించారు. ఆర్టీసీకి పూర్వవైభవం తీసుకువస్తామని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెబుతున్నారు.

ఆదివారం ఆర్టీసీ కార్మికులతో ప్రగతి భవన్‌లో జరగనున్న సమావేశంలో కేసీఆర్‌ కార్మికులతో అన్ని సమస్యలపై క్షుణ్ణంగా చర్చించనున్నారు. వారితో పలు అంశాలను చర్చించిన అనంతరం కార్మికులతో కలిసి భోజనం చేయనున్నారు. సమ్మె నేపథ్యంలో సీఎం వ్యవహరించిన తీరుతో కార్మికుల్లో పూర్తిగా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఈ పరిణామాలు భవిష్యత్‌లో ప్రభావం చూపే అవకాశాలు ఉండడంతో సంస్థ వాస్తవిక పరిస్థితులను వెల్లడించడంతో పాటు నేరుగా కార్మికులతో మాట్లాడడం ద్వార రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న ఆర్టీసీ కార్మికుల్లో ఒక భరోసా కల్పించడంతో ప్రభుత్వంపై సానుకూల అభిప్రాయం ఏర్పడే ప్రయత్నాలు చేయనున్నారు.

ఈ సమావేశంలో కార్మికుల సమస్యలు, యూనియన్ల అంశం, ఆర్టీసీకి, ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన విషయాలను సీఎం కేసీఆర్ కూలంకషంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. గత నలభై ఏళ్లుగా ఆర్టీసీ చుట్టూ అల్లుకున్న సమస్యలకు శాశ్వత పరిష్కరం దొరకనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకువచ్చి సింగరేణి సంస్థ వలే తీర్చిదిద్దాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. యూనియన్లు లేకుండా కార్మికుల సమస్యలను ఎలా పరిష్కరిస్తానే అంశాలను కూడ ఆయన వారితో పంచుకోనున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్‌ కార్మికులతో లంచ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories