Pragathi Bhavan: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం

Pragathi Bhavan: అన్‌లాక్‌ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Arun Chilukuri
Updated on: 18 Jun 2021 6:39 PM IST
CM KCR Meeting with Officials in Pragathi Bhavan
X

సీఎం కేసీఆర్(ఫైల్ ఇమేజ్ )

Pragathi Bhavan: అన్‌లాక్‌ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రేపటితో లాక్‌డౌన్‌ ముగియనుండటంతో ఢిల్లీ తరహా అన్‌లాక్‌కు తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు నైట్‌ కర్ఫ్యూను అమలు చేస్తూ 50శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు, బార్లు, పబ్‌లకు అనుమతి ఇఛ్చేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరికాసేపట్లో ప్రగతిభవన్‌లో వైద్యారోగ్యశాఖ నేతలతో సమావేశంకానున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story