CM KCR: ఈ నెల 26న ప్రగతిభవన్‌లో దళిత బంధుపై సదస్సు

CM KCR: హుజూరాబాద్‌ వాసులకు అవగాహన కల్పించనున్న సీఎం * పథకం లక్ష్యం, అమలుతీరుపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం

Sandeep Eggoju
Published on: 23 July 2021 10:27 AM IST
CM KCR meeting on Dalita Bandhu in Pragathi Bhavan on July 26th
X

సీఎం కేసీఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనున్న దళితబంధు పథకంపై తొలి అవగాహన సదస్సు ఈ నెల 26న ప్రగతిభవన్‌లో జరగనుంది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న ఈ పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగే ఈ సమావేశంలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి నలుగురు చొప్పున, ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున కలిపి మొత్తం 412 మంది దళిత పురుషులు, మహిళలు పొల్గొంటారు. వారితోపాటు 15 మంది రిసోర్స్‌ పర్సన్స్‌ కూడా సమావేశానికి హజరవుతారు. దళితబంధు పథకం రాష్ట్రంలోని దళితులందరి జీవితాల్లో గుణాత్మక మార్పునకు ఏ విధంగా దోహదపడుతుంది? అనే అంశాలపై సీఎం కేసీఆర్‌ అవగాహన కల్పించనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story