ఉద్యోగ సంఘాలతో ముగిసిన కేసీఆర్ భేటీ.. ఫాంహౌస్‌కి బయల్దేరిన సీఎం కేసీఆర్

ఉద్యోగ సంఘాలతో ముగిసిన కేసీఆర్ భేటీ.. ఫాంహౌస్‌కి బయల్దేరిన సీఎం కేసీఆర్
x
Highlights

ప్రగతిభవన్ లో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్ ముగిసింది. ఈ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాలకు చెందిన 250మంది పాల్గొన్నారు. వేతనాలు, ఉద్యోగ...

ప్రగతిభవన్ లో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్ ముగిసింది. ఈ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాలకు చెందిన 250మంది పాల్గొన్నారు. వేతనాలు, ఉద్యోగ విరమణ వయస్సు పెంపుపై ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. పదోన్నతులు ఇవ్వడం, అవసరమైన బదిలీలు చేయడం, సరళతరమైన సర్వీసు నిబంధనల రూపకల్పనపైనా అభిప్రాయాలు తీసుకున్నారు. అలాగే రిటైర్ అయ్యే రోజే ఉద్యోగులకు అన్నిరకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామకాలన్నింటినీ చేపట్టడం లాంటి అనేక అంశాలపై ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ చర్చించారు.

అయితే, ఉద్యోగ సంఘాల మీటింగ్‌లోనే పీఆర్సీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారని భావించారు. కానీ, పీఆర్సీపై ఎలాంటి ప్రకటన లేకుండానే సమావేశం ముగిసింది. అయితే, కాసేపట్లో పీఆర్సీ రిపోర్ట్‌ను సీఎస్ సోమేష్ కుమార్‌కు పీఆర్సీ కమిటీ ఛైర్మన్ అందజేయనున్నారు. ఇక, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం ముగియడంతో సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌కు బయల్దేరి వెళ్లారు. ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలతో మీటింగ్ ముగియడంతో త్వరలోనే ఉపాధ్యాయ సంఘాలతోనూ ముఖ్యమంత్రి సమావేశంకానున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories