logo
తెలంగాణ

దేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌

CM KCR Leave on a 10-day Tour of Country
X

దేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌

Highlights

CM KCR: సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించేందుకు ప్లాన్ చేశారు.

CM KCR: సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించేందుకు ప్లాన్ చేశారు. ఇవాళ కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. జాతీయ స్థాయిలో పలు రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. దేశం కోసం వీర మరణం పొందిన సైనికు కుటుంబాలకు, రైతు ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థికసాయం చేయనున్నారు. ఎల్లుండి చండీగఢ్‌కు వెళ్లనున్న సీఎం కేసీఆర్. మొత్తం 600 రైతు కుటుంబాలకు ఆర్థికసాయం అందించనున్నారు.

సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్‌తో కలిసి ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చొప్పున ఆర్థికసాయం చేయనున్నారు. మే 26న సీఎం కేసీఆర్ బెంగళూరుకు వెళ్లనున్నారు. మాజీ భారత ప్రధాని దేవగౌడ కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమౌతారు. బెంగుళూరు నుంచి మే 27న రాలేగావ్ సిద్ది పర్యటన చేయనున్నారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. అటునుంచి సాయిబాబా దర్శనం కోసం సీఎం కేసీఆర్ షిరిడీ వెళతారు. అక్కడనుంచి పర్యటనలను ముగించుకుని తిరిగి సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు చేరుకుంటారు.

Web TitleCM KCR Leave on a 10-day Tour of the Country
Next Story