మెట్రో రెండో దశకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్‌

CM KCR Lays Foundation Stone To Metro Second Phase Works At Mind Space
x

మెట్రో రెండో దశకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్‌

Highlights

Metro Second Phase: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండో దశకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు.

Metro Second Phase: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండో దశకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. నాగోల్‌-రాయదుర్గం కారిడార్‌-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ మెట్రోకు మైండ్‌స్పేస్‌ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన పునాదిరాయి వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, మంత్రులు కేటీఆర్‌, మ‌హ‌ముద్ అలీ, సబిత, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, మ‌ల్లారెడ్డి, ఎంపీలు కేశ‌వ‌రావు, రంజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories