కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్

X
Highlights
జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆయనకు వేద పండితలు పూర్ణకుంభంతో స్వాగతం...
Arun Chilukuri31 Oct 2020 7:56 AM GMT
జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆయనకు వేద పండితలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకుల మంత్రోచ్ఛరణాల మధ్య రైతు వేదిక శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. రైతులు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి సీఎం కేసీఆర్‌కు మద్దతు తెలిపారు. రైతు వేదిక అందుబాటులోకి రావడంతో రైతులందరూ సంతోషం వ్యక్తం చేశారు. రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Web TitleCM KCR launched Rythu Vedika in Kodakandla
Next Story