ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం
ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సీఎస్ సోమేష్‌కుమార్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల పీఆర్సీపై చర్చిస్తున్నారు. ఉద్యోగ సంఘాలతో రేపు లంచ్ మీటింగ్ నిర్వహించనున్న కేసీఆర్ ఉద్యోగుల సమక్షంలోనే పీఆర్సీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రగతిభవన్‌లో రేపటి లంచ్ మీటింగ్‌పై ఉద్యోగ సంఘాల ముఖ్యనేతలకు ఇప్పటికే సీఎంవో నుంచి ఆహ్వానాలు వెళ్లినట్లు తెలుస్తోంది.
Next Story




