CM KCR: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత.. కేసీఆర్‌ గ్యాస్ట్రిక్‌ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతున్నారు

CM KCR: సిటీ, ఎండోస్కోపీ వైద్య పరీక్షలు నిర్వహించాం

Dhatripriya
Published on: 12 March 2023 4:38 PM IST
CM KCR Joined At AIG Hospitals Gachibowli Due To Gastric Problem
X

CM KCR: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత.. కేసీఆర్‌ గ్యాస్ట్రిక్‌ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతున్నారు

CM KCR: సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన ప్రగతిభవన్ నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్ కు ఏఐజీ చైర్మన్‌ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని చెప్పారు వైద్యులు. గ్యాస్ట్రిక్‌ ప్రాబ్లమ్‌తో సీఎం కేసీఆర్‌ ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు. సిటీ, ఎండోస్కోపీ వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. సంబంధిత వైద్య చికిత్స అందిస్తున్నామని వివరణ ఇచ్చారు వైద్యులు. ఇక.. ఇప్పటికే గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి మంత్రులు హరీష్‌రావు, శ్రీనివాస్ గౌడ్ తో పాటు.. ఎమ్మెల్సీలు కవిత, కౌశిక్‌రెడ్డి, సీపీ స్టీఫెన్ రవీంద్ర చేరుకున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story