CM KCR: గంజాయిపై యుద్ధం ప్రకటించాలి

CM KCR: గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి : సీఎం కేసీఆర్

Sandeep Eggoju
Published on: 20 Oct 2021 5:40 PM IST
CM KCR Issued Orders to Officers on Ganja in Telangana
X

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గంజాయి సరఫరాను అడ్డుకోకుంటే మనం సాధిస్తున్న విజయాలు నిర్వీర్యం అవుతాయన్నారు సీఎం. గంజాయి యుద్ధం చేయాలని డ్రగ్స్ సరఫరాను అరికట్టాలన్నారు. ఆ దిశగా అధికారులు పటిష్ట వ్యూహాన్ని రచించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎక్సైజ్‌ శాఖాధికారులు తమ జిల్లాల పరిధిలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను సీఎంకు వివరించారు. రాష్ట్రంలో గుడుంబా, పేకాట నియంత్రణ పటిష్టంగా అమలు అవుతున్నప్పటికీ అక్కడక్కడా తిరిగి మొదలవుతున్నట్టు సీఎం కేసీఆర్ అన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story