బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు.. బడ్జెట్‌ను కుదించేందుకు ప్రణాళికలు సిద్ధం?

బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు.. బడ్జెట్‌ను కుదించేందుకు ప్రణాళికలు సిద్ధం?
x

బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు.. బడ్జెట్‌ను కుదించేందుకు ప్రణాళికలు సిద్ధం?

Highlights

తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ కసరత్తుపై ప్రారంభించింది. పద్దు సంబంధిత అంశాలపై ఇప్పటికే అధికారులతో సమీక్షించిన కేసీఆర్ ప్రతిపాదనల తయారీపై దిశానిర్దేశం...

తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ కసరత్తుపై ప్రారంభించింది. పద్దు సంబంధిత అంశాలపై ఇప్పటికే అధికారులతో సమీక్షించిన కేసీఆర్ ప్రతిపాదనల తయారీపై దిశానిర్దేశం చేశారు. అయితే తెలంగాణ బడ్జెట్‌ను ప్రభుత్వం కుదించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత బడ్జెట్‌తో పోలిస్తే 20శాతం తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.

కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిగా మారింది. దీనికి అనుగుణంగా తెలంగాణ బడ్జెట్ రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత సంవత్సరం కంటే కనీసం 20 శాతం తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కరోనాతో తెలంగాణ ప్రభుత్వం 50,000 కోట్ల పైగా ఆదాయ నష్టాలను చవిచూసింది. 2020-21 బడ్జెట్‌ను 1.82 లక్షల కోట్ల రూపాయలతో ఆర్థిక బడ్జెట్‌ని ప్రవేశ పెట్టారు. 2021-22 బడ్జెట్ 1.5 లక్షల కోట్ల రూపాయల కన్నా తక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు ఆర్థిక శాఖ అధికారులు. మరోవైపు గతంలో కేంద్ర ప్రభుత్వ నిధులు, గ్రాంట్లలో ఆర్థిక మందగమనం, భారీ కోతలను విధించింది. 2021-22లో రూ .5 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుందని అంచనా వేసారు. బడ్జెట్ పరిమాణాన్ని కత్తిరించే అవసరాన్ని అధికారులు సీఎం కేసీఆర్‌కు గత బడ్జెట్ సమావేశంలో వివరించారు.

ఈ ఏడాది మార్చి 31తో 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు మిగిలిన వారంలో నష్టాలను తీర్చడానికి పెద్దగా అవకాశం లేదు. ధరణి పోర్టల్ ప్రారంభ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లను నిలిపివేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీ మూల్యం చెల్లించింది. 2020-21 ఇయర్ లో ఆస్తి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వం కేవలం 3,189 కోట్లు వసూలు చేసింది. జీఎస్టీలో ఇప్పటివరకు 18,429 కోట్లు మాత్రమే ఆర్జించింది. 26,400 కోట్ల రూపాయల అమ్మకపు పన్ను లక్ష్యానికి 13,954 కోట్లు వసూలు చేయగలిగింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి 10,906 కోట్ల రూపాయలు వస్తాయని బడ్జెట్ అంచనా వేసింది, అయితే కేంద్రం ఇప్పటివరకు కేవలం 5,412 కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేసింది.

కరోనా మహమ్మారి కారణంగా పన్నుయేతర ఆదాయాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. 30,600 కోట్లు సంపాదించాలనే లక్ష్యానికి గండి పడింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ మందగించడం, రవాణా పన్నుల వసూలు, మైనింగ్ సెస్ కారణంగా 2,450 కోట్లు మాత్రమే సాకారం అయ్యాయి. బడ్జెట్ ఎక్సైజ్ లక్ష్యం 16,000 కోట్లు అయితే రాష్ట్రం ఇప్పటివరకు 8,874 కోట్లు మాత్రమే సంపాదించింది. మొత్తంగా రాష్ట్రానికి వివిధ మార్గాల ద్వారా రావాల్సిన ఆదాయం పడిపోవడంతో ఈ సారి బడ్జెట్ ను కుదించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories