CM KCR Instructed : హుందాగా సచివాలయం.. సీఎం కేసీఆర్‌ నిర్దేశం

CM KCR Instructed : హుందాగా సచివాలయం.. సీఎం కేసీఆర్‌ నిర్దేశం
x
Highlights

CM KCR instructed : తెలంగాణ సచివాలయ కొత్త భవనం హుందాగా, సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. బాహ్య రూపం...

CM KCR instructed : తెలంగాణ సచివాలయ కొత్త భవనం హుందాగా, సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. బాహ్య రూపం ఆకర్షణీయంగా, హుందాగా ఉండాలని, లోపల అన్ని సౌకర్యాలు ఉండాలని నిర్దేశించారు. కొత్త సచివాలయ భవన నిర్మాణంపై ముఖ్యమంత్రి మంగళవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు సునిల్ శర్మ, రామకృష్ణ, రజత్ కుమార్, నర్సింగ్ రావు, ఆస్కార్-పొన్ని అర్కిటెక్స్ట్ నిపుణులు హాజరయ్యారు.

డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. కొన్ని మార్పులు సూచించారు. భవనంలో ఉండాల్సిన వాటిపై పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారులు వారి సిబ్బంది పనిచేయడానికి అనుగుణంగా కార్యాలయాలుండాలని చెప్పారు. ప్రతీ అంతస్తులో ఒక డైనింగ్ హాలు, సమావేశ మందిరం ఉండాలని చెప్పారు. విఐపిలు, డెలిగేట్స్, డిగ్నిటరీస్, ఇతర ప్రముఖులు, అతిథుల కోసం ప్రత్యేక వెయిటింగ్ హాళ్లు ఉండాలని చెప్పారు. సెక్రటేరియట్లో ఏం పని జరుగుతుంది? ఎందరు పనిచేస్తారు? ఎందరు సందర్శకులుంటారు? తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories