Siddipet: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

Siddipet: జిల్లాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తొలిరోజు సిద్దిపేటకు వెళ్లారు.

Arun Chilukuri
Updated on: 20 Jun 2021 2:26 PM IST
CM KCR Inaugurates Siddipet MLA Office
X

Siddipet: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

Siddipet: జిల్లాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తొలిరోజు సిద్దిపేటకు వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి హరీశ్‌ రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇవాళ సిద్దిపేట‌లో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టనున్నారు.

ఆధునిక స‌దుపాయాల‌తో జీప్ల‌స్ వ‌న్‌గా ఎక‌రం విస్తీర్ణంలో రూ.4 కోట్ల‌తో సిద్దిపేట ఎమ్మెల్యే కార్యాల‌యాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో కార్యాల‌యం, మొద‌టి అంత‌స్తులో నివాస స‌ముదాయం ఏర్పాటు చేశారు. అనంత‌రం కొండ‌పాక మండ‌లం రాంప‌ల్లి శివారులోని సిద్దిపేట‌ పోలీస్ క‌మిష‌న‌రేట్‌ స‌ముదాయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ పోలీసుల గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం కామారెడ్డి జిల్లా పర్యటనకు సీఎం వెళ్లనున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story