CM KCR: గ‌ద్వాల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించిన సీఎం కేసీఆర్

Cm Kcr సీఎం కేసీఆర్ ఇవాళ జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు

Dhatripriya
Updated on: 12 Jun 2023 5:33 PM IST
Cm Kcr Inaugurates Gadwal Sp Office
X

Cm Kcr: గద్వాల జిల్లాలో.. బీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

Cm Kcr: సీఎం కేసీఆర్ ఇవాళ జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయంతో పాటు.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం గద్వాల జిల్లాలోని ఐజ రోడ్డులో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో గద్వాల పట్టణం గులాబీమయంగా మారింది. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ బీఆర్‌ఎస్‌ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లతో నిండిపోయాయి. సమీకృత కలెక్టర్‌ కార్యాలయం, ఎస్పీ, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలను విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పరిశీలించారు.

Dhatripriya

Dhatripriya

Next Story