Telangana: ఇవాళ వైద్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ రివ్యూ

Telangana: ఇవాళ తెలంగాణ వైద్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష జరపనున్నారు.

Arun Chilukuri
Published on: 24 May 2021 10:14 AM IST
CM KCR Holds Review Meeting With Health Dept Officials Over Corona Vaccination
X

కేసీఆర్(ఫైల్ ఇమేజ్ )

Telangana: ఇవాళ తెలంగాణ వైద్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష జరపనున్నారు. మధ్యాహ్నం ప్రగతి భవన్‌ నుంచి సమీక్ష చేయనున్న సీఎం.. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పది రోజులుగా వ్యాక్సినేషన్ నిలిచిపోవడంతో ఇవాళ టీకా పంపిణీలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

ఇక తెలంగాణలో వ్యాక్సినేషన్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. పది రోజులుగా వ్యాక్సినేషన్ నిలిపివేయడంతో జనం ఆందోళన చెందుతున్నారు. కేంద్రం నుంచి టీకాలు రాకపోవడంతో వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేయగా తిరిగి ఎప్పుడు మొదలవుతుందనే క్లారిటీ రాలేదు. అయితే ఇవాళ సీఎం కేసీఆర్ వైద్యశాఖ అధికారులతో సమీక్ష జరపనుండగా వ్యాక్సినేషన్‌పై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story