స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్ కసరత్తు

Pragathi Bhavan: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.

Arun Chilukuri
Published on: 20 Nov 2021 4:55 PM IST
CM KCR Holds Meeting with Ministers in Pragathi Bhavan
X

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్ కసరత్తు 

Pragathi Bhavan: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ప్రగతి భవన్‌లో మంత్రులతో సమావేశమయ్యారు. మంత్రులు పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, జగదీష్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. హైదరాబాద్‌ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైంది. 12 ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story