Sagar Bypoll: నోముల భగత్ కు బీ-ఫామ్ అందచేసిన కేసీఆర్

Sagar Bypoll: నాగార్జునసాగర్ టీఆర్ఎస్‌ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరదించారు ఆ పార్టీ అధినేత కేసీఆర్.

Arun Chilukuri
Published on: 29 March 2021 3:56 PM IST
CM KCR Handover B Form to Nomula Bhagath
X

Sagar Bypoll: నోముల భగత్ కు బీ-ఫామ్ అందచేసిన కేసీఆర్

Sagar Bypoll: నాగార్జునసాగర్ టీఆర్ఎస్‌ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరదించారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. నోముల భగత్ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేశారు. మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ ను అభ్యర్థిగా బరిలోకి దించేందుకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ భవన్ చేరుకున్న సీఎం కేసీఆర్ నోముల భగత్ కు బీ-ఫామ్ అందచేశారు.

గత కొద్దిరోజులుగా సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ పరిస్థితులతో పాటు నేతల అభిప్రాయాలు, సర్వే రిపోర్టులను సేకరించిన కేసీఆర్ నోముల భగత్ కు టికెట్ ఖరారు చేశారు. నోముల భగత్ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నాగార్జుసాగర్ టికెట్ ను ఆశించిన కోటిరెడ్డి, చిన్నపరెడ్డిలతో సీఎంక్ కేసీఆర్ మాట్లాడి భగత్ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story