గ‌ల్వాన్ అమ‌ర జ‌వాన్ల కుటుంబాల‌కు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం

Galwan Valley: గ‌ల్వాన్ అమ‌ర జవాన్ల కుటుంబాల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందించారు.

Arun Chilukuri
Published on: 4 March 2022 5:29 PM IST
CM KCR Handed Checks Worth Rs. 10 Lakh to the Families of Jawans Martyred in Galwan Valley Clashes
X

గ‌ల్వాన్ అమ‌ర జ‌వాన్ల కుటుంబాల‌కు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం 

Galwan Valley: గ‌ల్వాన్ అమ‌ర జవాన్ల కుటుంబాల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం గాల్వన్ వ్యాలీలో అమరులైన సైనికుల కుటుంబాలకు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో కలిసి ఆర్థిక సాయం అందించారు సీఎం కేసీఆర్. అమర సైనికుడు కుందన్ కుమార్ ఓజా భార్య నమ్రత కుమారికి, మరో వీర సైనికుడు గణేష్ కుటుంబ సభ్యులకు చెరో రూ.10 లక్షల చెక్ లను అందించారు.

ఈ సంద‌ర్భంగా భావోద్వేగానికి లోనైన వారిని కేసీఆర్ ఓదార్చారు. అండ‌గా ఉంటామ‌ని కేసీఆర్ భ‌రోసానిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షులు వినోద్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌తో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story