Telangana: కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్

Telangana: క్రమ‌బ‌ద్దీక‌ర‌ణ ద‌స్త్రంపై సంతకం చేసిన సీఎం కేసీఆర్

Jyothi
Published on: 30 April 2023 5:45 PM IST
CM KCR Good News to Contract Employees
X

Telangana: కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్

Telangana: కొత్త సచివాలయం ప్రారంభం రోజున కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. క్రమబద్దీకరణ ఫైలుపై మొదటి సంతకం చేశారు. మొత్తం 40 విభాగాల్లో 5వేల 5వందలా 44 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కనక చంద్రంకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఉత్తర్వు ప్రతిని సచివాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వేళలా తెలంగాణ ప్రభుత్వం వెంటే ఉంటామని, సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.

Jyothi

Jyothi

Next Story