CM KCR: ఇవాళ వాసాలమర్రికి సీఎం కేసీఆర్

CM KCR: దళితవాడలో సీఎం పర్యటన * రైతువేదికలో 130 మందితో సమావేశం

Sandeep Eggoju
Updated on: 4 Aug 2021 1:34 PM IST
CM KCR Going To Vasalamarri Today
X
సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: సీఎం కేసీఆర్ ఇవాళ మళ్లీ యాదాద్రి భువనగిరి జిల్లాలోని దత్తత గ్రామమైన వాసాలమర్రికి వెళ్లనున్నారు. దళితవాడలో పర్యటనతో పాటు రైతువేదికలో 130 మందితో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని నిన్న కేసీఆర్ స్వయంగా అధికార యంత్రాంగానికి, గ్రామసర్పంచ్‌ ఆంజనేయులుకు ఫోన్‌చేసి చెప్పారు. గతంలో ఇచ్చిన హామీల అమలును ఆయన సమీక్షిస్తారు.

జూన్‌ 22న ఈ గ్రామంలో పర్యటించిన కేసీఆర్‌ గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసి, వారితో సమావేశమయ్యారు. గ్రామాభివృద్ధిపై వారికి దిశానిర్దేశం చేశారు. సత్వర కార్యాచరణ కోసం అధికారులకు ఆదేశాలిచ్చారు. మరో 20 సార్లు అయినా వాసాలమర్రికి వస్తానని గతంలో చెప్పారాయన. ఇచ్చిన మాట ప్రకారం గత నెలలో పర్యటనకు సిద్ధం కాగా.. వర్షాల కారణంగా రద్దైంది. దీంతో ఇవాళ గ్రామాన్ని సందర్శించేందుకు వెళ్తున్నారు సీఎం.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story