CM KCR: ఢిల్లీకి బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్

CM KCR: బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హస్తినకు కేసీఆర్

Sandeep Eggoju
Published on: 21 Nov 2021 7:33 PM IST
CM KCR Going to Delhi Today to Meet PM Modi
X

ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్ (ఫోటో ది హన్స్ ఇండియా)

CM KCR: సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హస్తినకు కేసీఆర్ బయల్దేరి వెళ్లారు. సీఎం వెంట మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఢిల్లీ టూర్‌లో కేంద్ర మంత్రులు, ప్రధానిని కలిసి ధాన్యం కొనుగోళ్లు, నీటి పంపకాలు, కులగణన, విద్యుత్ చట్టాల రద్దుపై విజ్ఞప్తి చేస్తామని ఇప్పటికే సీఎం చెప్పారు. మరోవైపు కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో సీఎం సతీమణి శోభకు వైద్య పరీక్షలు చేయనున్నారు. అందుకోసం రెండు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story