CM KCR: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ క్లారిటీ..

CM KCR: BRS విస్తృత స్థాయి సమావేశంలో గులాబీ బాస్ కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు.

Arun Chilukuri
Published on: 10 March 2023 5:26 PM IST
CM KCR Gives Clarity On Early Elections In Telangana
X

CM KCR: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ క్లారిటీ..

CM KCR: BRS విస్తృత స్థాయి సమావేశంలో గులాబీ బాస్ కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్‌లోనే ఎన్నికలకు వెళ్తామని, ముందస్తు సమస్యే లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. అక్టోబర్ నెలలో ఓరుగల్లు గడ్డపై బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర నేతలు నియోజకవర్గాల్లోనే ఉండాలని సూచించారు. విస్తృతంగా పాదయాత్రలు చేస్తూ ప్రజలతో మమేకం కావాలన్నారు. గ్రామగ్రామాన, అన్ని వార్డుల్లోనూ కార్నర్ సభలు పెట్టాలని కేసీఆర్ సూచించారు. ఎటువంటి అభివృద్ధి పథకాలైనా పెండింగ్‌ లేకుండా చూసుకోవాలని గులాబీ నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇకపై టీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఉండదని... దానికి బదులుగా బీఆర్ఎస్ ఆవిర్భావ ఉత్సవాలు ఉంటాయన్నారు కేసీఆర్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story