CM KCR: షెడ్యూల్ ప్రకార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు.. పాత వాళ్లకే టికెట్లు..

TRSLP Meeting: తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ముగిసింది.

Arun Chilukuri
Published on: 15 Nov 2022 5:39 PM IST
CM KCR Gives Clarity on Early Elections
X

CM KCR: షెడ్యూల్ ప్రకార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు.. పాత వాళ్లకే టికెట్లు..

TRSLP Meeting: తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ముగిసింది. గంట పాటు జరిగిన ఈ సమావేశంలో.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా క్యాడర్‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చించారు. షెడ్యూల్ ప్రకార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని స్పష్టం చేశారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ప్రస‌క్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ శ్రేణులంతా ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలి. ప్రభుత్వ ప‌థ‌కాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లే అంశంపై చ‌ర్చించారు. ప్రజ‌ల మ‌ధ్యలోనే ఎమ్మెల్యేలు, నేతలు ఉండాల‌ని సీఎం సూచించారు. మ‌ళ్లీ పాత వాళ్లకే టికెట్లు ఇస్తామ‌ని కేసీఆర్ స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story