CM KCR: వరంగల్‌ గ్రేటర్‌ ఎన్నికలపై సీఎం కేసీఆర్ దృష్టి

CM KCR: జిల్లా మంత్రులతో ఫోనులో మాట్లాడిన సీఎం కేసీఆర్

Sandeep Eggoju
Published on: 16 April 2021 2:36 PM IST
CM KCR Focus on Warangal Greater Elections
X

ఎర్రబెల్లి దయాకర్ రావు & సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: వరంగల్‌ గ్రేటర్‌ ఎన్నికలపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. జిల్లా మంత్రులతో పాటు కీలక నేతలకు సీఎం ఫోన్ చేసి పలు సూచనలు చేశారు. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగువేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు సూచించారు. సర్వే నివేదిక తర్వాత గ్రూపు తగాదాలు లేకుండా చూసకోవాలని సీఎం ఆదేశించారు. గెలిచినా ఓడినా ఎమ్మెల్యేలదే బాధ్యత అంటూ హెచ్చరించారు. 66 స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేసేలా ప్రణాళికలు రచించాలని సీఎం కేసీఆర్ తెలిపారు. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌కు ఎన్నికల సమన్వయ బాధ్యతలు అప్పగించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story