CM KCR: మునుగోడుపై గులాబీ బాస్‌ ఫోకస్‌

CM KCR: రెండురోజుల పాటు మునుగోడులోనే కేసీఆర్‌ మకాం వేసే అవకాశం

Jyothi
Published on: 19 Oct 2022 12:03 PM IST
CM KCR Focus on Munugode
X

CM KCR: మునుగోడుపై గులాబీ బాస్‌ ఫోకస్‌

CM KCR: మునుగోడు ఉపఎన్నికను గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మునుగోడు గడ్డపై ఎట్టిపరిస్థితిల్లోనూ టీఆర్‌ఎస్‌ జెండా ఎగరవేయాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే గులాబీ బాస్‌ మునుగోడుపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఈ నెల 30 లేదా 31న ఆయన మునుగోడులో పర్యటించనున్నారు. రెండురోజుల పాటు మునుగోడులోనే కేసీఆర్‌ మకాం వేసే అవకాశం కూడా లేకపోలేదు. చండూరు మండలం బంగారిగడ్డలో కేసీఆర్‌ బహిరంగ సభకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్లాన్‌ చేస్తున్నాయి. ఈ సభకు లక్ష మంది జనసమీకరణ టార్గెట్‌గా కసరత్తు కూడా ప్రారంభించాయి. బీసీ ఓటర్లపైనే ఫోకస్‌ పెట్టిన టీఆర్‌ఎస్‌.. మునుగోడు ఓటర్లనే సభకు తరలించాలని ప్లాన్‌ చేస్తోంది.

భారీ ర్యాలీ తీసే ఆలోచనలో కూడా ఉంది గులాబీ పార్టీ. ఇక.. బీజేపీపై విమర్శలే టార్గెట్‌గా కేసీఆర్‌ స్పీచ్‌ ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పార్టీలన్నీ మునుగోడు గడ్డపై తిష్ట వేశాయి. బీసీ ఓటర్లపైనే ప్రత్యేక దృష్టి సారించి.. ప్రచారం నిర్వహిస్తున్నాయి. రోజుకు రెండుసార్లు ఓటర్లను కలిసేలా ప్రణాళికలు రచించుకున్నాయి పార్టీలు. అలాగే.. ఏ పార్టీ నాయకులతో ఓటర్లు టచ్‌లోకి వెళ్తున్నారనేదానిపై ప్రత్యేక నిఘా కూడా పెట్టాయి.

Jyothi

Jyothi

Next Story