Top
logo

ఎస్పీ బాలు మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం

ఎస్పీ బాలు మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం
X
Highlights

ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతిప‌ట్ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్య‌క్తం...

ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతిప‌ట్ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. బాలు కుటుంబ స‌భ్యుల‌కు కేసీఆర్ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. బాలు లేని లోటు ఎప్ప‌టికీ పూడ్చ‌లేనిది అని పేర్కొన్నారు. ఎన్నో సుమ‌ధుర గేయాలు పాడి ప్ర‌జ‌ల అభిమానం సంపాదించారు అని గుర్తు చేశారు. గాయ‌కుడిగా, న‌టుడిగా, సంగీత ద‌ర్శ‌కుడిగా సేవ‌లు అందించార‌ని సీఎం పేర్కొన్నారు. కరోనా సోకడంతో గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలకు గురైన ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1.04గంటలకు తుదిశ్వాస విడిచారు.Web TitleCM KCR expresses condolences to SP Balasubrahmanyam
Next Story