పెద్దల సభకు కేకే రెన్యువల్ అవుతారా.. కేకేను మళ్లీ రాజ్యసభకు పంపడం కేసీఆర్‌కు ఇష్టంలేదా?

పెద్దల సభకు కేకే రెన్యువల్ అవుతారా.. కేకేను మళ్లీ రాజ్యసభకు పంపడం కేసీఆర్‌కు ఇష్టంలేదా?
x
Highlights

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. దీంతో ఇప్పుడు కొందరు ఆశావహుల చూపు ఆ రెండు సీట్లపై పడింది. అయితే ఆ రెండింటిలో ఒకటి కే. కేశవ...

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. దీంతో ఇప్పుడు కొందరు ఆశావహుల చూపు ఆ రెండు సీట్లపై పడింది. అయితే ఆ రెండింటిలో ఒకటి కే. కేశవ రావుది. దీంతో ఈసారి కేకేను కేసీఆర్ రెన్యువల్ చేస్తారా లేదా అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. అంతేకాదు, కవిత, వినోద్‌ల పేర్లు కూడా పెద్దల సభ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ కేకే పదవి రెన్యువల్ కాదన్న ప్రచారం ఎందుకు జరుగుతోంది రాజ్యసభ రేసులో వినోద్, కవితల పేర్లు ఎందుకు వినిపిస్తున్నాయి?

త్వరలో రాజ్యసభలో పదవీ కాలం ముగుస్తున్న స్థానాల్లో, తెలంగాణ నుంచి రెండున్నాయి. అందులో ఒకటి టీఆర్ఎస్‌ నుంచి కే.కేశవ రావు కాగా, మరోకటి కాంగ్రెస్‌ నుంచి ఎం.ఏ.ఖాన్. ప్రస్తుతం టీ కాంగ్రెస్‌కు రాజ్యసభ ఎంపీని గెలిపించుకునే బలం లేకపోవడంతో, ఈ స్థానం కూడా టీఆర్‌ఎస్‌కే దక్కబోతోంది. అంటే రెండుస్థానాలూ గులాబీ పార్టీకే రాబోతున్నాయి. దీంతో ఆ సీట్లను కేసీఆర్‌ ఎవరితో భర్తీ చేస్తారన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.

ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్న కె.కేశవ రావు, తన పదవిని మరోసారి రెన్యువల్ చేయాలని కోరుకుంటున్నారు. కేకే రాజ్యసభ పదవి ఎక్కడికీ పోదని, ఆయకే ఇస్తారని కొందరంటున్నారు. అయితే, కేకే విషయంలో కేసీఆర్‌కు మరో ప్రణాళిక కూడా వుందన్న ఊహాగానాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. కేకేను తిరిగి రాజ్యసభకే పంపించడం కేసీఆర్‌‌కు ఇష్టంలేదట. ఆయనను ఎమ్మెల్సీ చేసి, మండలికి పంపిస్తారని, మంత్రిని చేయకపోయినా కేబినెట్‌ ర్యాంకుతో కూడిన పదవి ఇచ్చి, గౌరవం తగ్గకుండా చూసుకుంటారని ఒక వాదన వినిపిస్తోంది. కేకే సేవలు ఇక నుంచి రాష్ట్రస్థాయిలో వినియోగించుకోవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

కేకే రాజ్యసభ పదవిని రెన్యువల్‌ చేయకూడదని కేసీఆర్‌ భావిస్తుండటం వెనక మరో కథనం కూడా ప్రచారంలో వుంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో చర్చలకు తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ, కేకే మీడియాకు వెల్లడించడం అప్పట్లో సంచలనమైంది. తనను ఏమాత్రం సంప్రదించకుండా కేకే చర్చల ప్రస్తావన తీసుకురావడం, కేసీఆర్‌కు ఆగ్రహం తెప్పించిందట. ప్రగతి భవన్‌కు పిలిపించుకుని మాట్లాడారట. ఆ తర్వాత ఆర్టీసీ సమ్మెపై కేకే అసలు నోరు మెదపలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కేకే రాజ్యసభ పదవిని రెన్యువల్ చేయకూడదని కేసీఆర్‌ భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇదే జరిగితే కేకే ఎలా రియాక్ట్‌ అవుతారన్నది కూడా చర్చనీయాంశమైంది. రాజ్యసభ పదవి రెన్యువల్ చేయకపోతే కేకే ఎలా స్పందిస్తారు పార్టీ అధినేత నిర్ణయానికి విధేయత చూపుతారా లేదంటే ఏవైనా అసంతృప్తి వ్యాఖ్యానాలు చేస్తారా అని చాలామంది మాట్లాడుకుంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories