కమలంలో కేసీఆర్‌ కోవర్టులు.. చట్టాలను రద్దు వార్తను కేసీఆర్‌ చెవిలో వేసిందెవరు?

CM KCR‌ Coverts in Telangana BJP
x

కమలంలో కేసీఆర్‌ కోవర్టులు.. చట్టాలను రద్దు వార్తను కేసీఆర్‌ చెవిలో వేసిందెవరు?

Highlights

Telangana: తెలంగాణ బీజేపీలో మళ్లీ కోవర్టుల చర్చ సాగుతుందా?

Telangana: తెలంగాణ బీజేపీలో మళ్లీ కోవర్టుల చర్చ సాగుతుందా? ఇటీవల కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడం, అంతకుముందు సీఎం కేసీఆర్ ధర్నా చేయడం కమలంలో ఉన్న కోవర్టుల సమాచారంతోనే జరిగిందా? కమలం క్యాంప్‌లో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలే ఉప్పందించారా? కాషాయం పార్టీలో జరుగుతున్న ఆ చర్చేంటి? కీలక నేతలు అందించిన సమాచారంతోనే కేసీఆర్ ధర్నా చేశారని జరుగుతున్న చర్చలో వాస్తవమెంత?

రాజకీయాలలో కోవర్టుల ప్రచారం జరిగిందంటే అది కేవలం కాంగ్రెస్‌లోనే కనిపించేది. ఆ మాటలు వినిపించేది. నేరుగా కాంగ్రెస్ సీనియర్లు కోవర్టు ఎవరో పేర్లతో సహా చెప్పే సంస్కృతి హస్తం పార్టీలోనే ఉండేది. కాంగ్రెస్‌లో ఉన్న ఆందోళన ఆ కంగారే ఇప్పుడు కమంలోనూ కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ బీజేపీలో టీఆర్‌ఎస్ కోవర్టుల చర్చ జోరుగా నడుస్తోంది. పార్టీలో ఎవరో అధికార పార్టీకి కీలక సమాచారం అందిస్తున్నారని కొందరు నేతలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ పార్టీ బలపడుతుండడంతో పార్టీని వీక్ చేయడానికి సీఎం కేసీఆర్‌కు పూర్తి వివరాలు అందిస్తున్నారు. ఎవరనే దాని పార్టీలో ఏ ఇద్దరు నేతలు కలిసిన చర్చించుకుంటున్నట్లు కమలం పార్టీ కనబడుతుంది.

తాజాగా తెలంగాణలో జరిగిన పరిణామాలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రెండు ఒకేసారి జరగడం తెలంగాణ బీజేపీని షాక్‌కు గురి చేసినట్టయింది. కేంద్రం అమలు చేయడానికి సిద్ధంగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు చేయాలనే డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ ధర్నా చౌక్‌ వద్ద ఆందోళనకు దిగారు. సాధారణంగా సీఎం కేసీఆర్ నిరసన కార్యక్రమాలను ప్రకటించి, వాయిదా వేయడం ఆయన నైజంగా చెప్పుకుంటారు విశ్లేషకులు. ఈసారి ఆయనే స్వయంగా ప్రకటించడమే కాకుండా ధర్నాలో కూర్చోవడం రాజభవన్ వరకు పాదయాత్ర చేస్తూ వెళ్లి గవర్నర్ తమిళ సైకి టీఆర్‌ఎస్ డిమాండ్ లేఖను ఇవ్వాలని ప్రయత్నించడం, ఆ తర్వాత రోజే కేంద్రం మూడు రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించడం తెలంగాణ బీజేపీని నిద్ర పట్టనీవ్వడం లేదట.

కాషాయం క్యాంప్‌లో ఎవరో ఒకరు హస్తినలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను, అక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలను సీఎం కేసీఆర్‌కు పూసగుచినట్లు చెబుతున్నారని తెలంగాణ కమలం పార్టీ నేతలు అనుమానపడుతున్నారు. పార్టీకి సంబంధించిన కీలక నేతలు సీఎం కేసీఆర్‌కు సమాచారం ఇవ్వకపోతే ఇలా ధర్నా చేయడం, చట్టాలను రద్దు చేయడం, ఎలా సాధ్యమని కాషాయపార్టీ నేతలు చర్చించుకుంటున్నారట. పార్టీలో ఎవరో కీలక నేత టీఆర్‌ఎస్ కోవర్టు పని చేస్తున్నట్లు కమలం పార్టీని మథనపడుతోందట. అయితే, కేంద్ర ప్రభుత్వంలో అత్యంత సన్నిహిత సంబంధాలున్న నేత ఎవరన్నా సీఎం కేసీఆర్‌కు పూర్తి సమాచారం చేరవేస్తున్నారని, పార్టీలో చర్చ సాగుతోంది. కీలకంగా ఉన్న కాషాయం నేతలు కేసీఆర్‌కు ఉప్పందించే పనిలో ఉన్నారని నేతలు చెప్పుకుంటున్నారు. మరి ఈ కోవర్టులు ఎవరో పార్టీ వారిని ఎలా పట్టుకుంటుందో లేదా లైట్‌ తీసుకుంటుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories