భట్టికి ప్రమోషన్ కల్పించాలంటూ కేసీఆర్ ఆసక్తికరమైన కామెంట్

CM KCR Congratulates Bhatti Vikramarka
x

భట్టికి ప్రమోషన్ కల్పించాలంటూ కేసీఆర్ ఆసక్తికరమైన కామెంట్

Highlights

CM KCR: అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.

CM KCR: అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క ప్రభుత్వ రంగ సంస్థలు నానాటికీ కనుమరుగైపోతున్న తీరుపై కాస్త డీటెయిల్డ్ గా మాట్లాడారు. దానికి రిప్లయిగా ముఖ్యమంత్రి కేసీఆర్ భట్టిగారు ఆ విషయాన్ని పార్లమెంట్ లో మాట్లాడితే బాగుంటుందన్నారు. అది నేషనల్ సబ్జెక్టు అని భట్టిని పార్లమెంట్ కు పంపిస్తే బాగుంటుందని తమ సభ్యులు కూడా అంటున్నారని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా సభలో నవ్వులు పూశాయి. దీంతో రోజూ వాడీవేడిగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు సరదాగా ముగిశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories