మతం అనే క్యాన్సర్‌ బారిన పడొద్దు: సీఎం కేసీఆర్‌

KCR: రూ.2016 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

Rama Rao
Updated on: 26 April 2022 4:17 PM IST
CM KCR Comments on Opposition Leaders | TS News Today
X

KCR: కొందరు కులం, మతం పేరుతో చిల్లర మాటలు

KCR: దేశంలో వింత రాజకీయాలు మొదలయ్యాయంటూ విపక్షాలపై విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. హైదరాబాద్ నలు మూలల నాలుగు టిమ్స్ ఆస్పత్రులకు ఆయన ఇవాళ భూమిపూజ చేశారు. కొందరు కులం, మతం పేరుతో చిల్లర మాటలు మాట్లాడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. మతం అనేది ఓ క్యాన్సర్‌ అని, ఆ క్యాన్సర్‌ బారిన పడితే ప్రమాదంలో పడిపోతామని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన పిలుపు ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన ఏడున్నరేళ్లలో తలసారి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. 2016 రూపాయల పెన్షన్ తెలంగాణలో తప్ప ఎక్కడా ఇవ్వడం లేదని కేసీఆర్ తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story