సారు కారు గేరు మార్చబోతున్నారా.. రాబోయే మూడు నెలల్లో ఏదైనా రాజకీయ సంచలనం ఖాయమా?

CM KCR Busy with Meetings and Party Development Works
x

సారు కారు గేరు మార్చబోతున్నారా.. రాబోయే మూడు నెలల్లో ఏదైనా రాజకీయ సంచలనం ఖాయమా?

Highlights

CM KCR: పార్టీ కార్యకర్తలతో సమావేశాలు కీలక నేతలతో మంతనాలు జిల్లా పర్యటనలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు క్షణం తీరిక లేకుండా బిజీ షెడ్యూల్‌ ఫిక్స్ చేసుకున్నారు గులాబీ బాస్.

CM KCR: పార్టీ కార్యకర్తలతో సమావేశాలు కీలక నేతలతో మంతనాలు జిల్లా పర్యటనలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు క్షణం తీరిక లేకుండా బిజీ షెడ్యూల్‌ ఫిక్స్ చేసుకున్నారు గులాబీ బాస్. మరి సడెన్‌గా ఈ పొలిటికల్‌ ధూంధాం ఏంటి? తెలంగాణ రాజకీయ వేడిని ఇఫ్పుడే ఎందుకు రగిలించాలనుకుంటున్నారు?

వరుస మీటింగ్‌లు, ప్రారంభోత్సవాలు సీఎం కేసీఆర్‌ బిజీ షెడ్యూల్. సడెన్‌గా టీఆర్ఎస్ అధినేత పొలిటికల్‌ ధూంధాం ఏంటి? సారు కారు గేరు మార్చబోతున్నారా? మరో సంగ్రామానికి సైన్యాన్ని సిద్దం చేస్తున్నారా? తెలంగాణలో ఏం జరుగుతోంది? ఇకముందు ఏం జరగబోతోంది? గులాబీ బాస్‌ మదిలో ఏముంది?

తెలంగాణలో ఒకవైపు ఎముకలు కొరికే చలి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు రాజకీయ వాతావరణం సలసల వేడెక్కుతున్నట్టు కనిపిస్తోంది. తమిళనాడు పర్యటన తర్వాత, సీఎం కేసీఆర్‌ ఒక్కసారిగా యాక్టివ్‌ కావడమే ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వంకుట్ల చంద్రశేఖర్ రావు, రానున్న రోజుల్లో బిజీబిజీ షెడ్యూల్‌ ఫిక్స్ చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ నేతలతో మీటింగ్. పార్టీ సంస్థాగత నిర్మాణంపైనా దృష్టి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, డీసీఎంఎస్‌, డీసీసీబీ అధ్యక్షులు, రైతు బంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్లతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం కూడా ఇందులో పాల్గొంటుంది. ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలకు భవిష్యత్‌ కార్యాచరణ పట్ల దిశానిర్దేశం చేస్తారు కేసీఆర్. 19 నుంచి జిల్లాల పర్యటనలు మొదలెడతారు. కలెక్టరేట్లు, పార్టీ ఆఫీసులను ప్రారంభిస్తారు. ఆ తర్వాత దళితబంధుపై సమీక్షిస్తారు. ఒక్కసారిగా కేసీఆర్ ఇంత హడావుడి ఏంటి? ఇదంతా యుద్దానికి ముందు సన్నద్దతా?

మామూలుగా అయితే, ఈ స్థాయిలో సమావేశాలు జరపడానికి ఇప్పటికిప్పుడు ఎన్నికల్లేవు. రాబోయే కొన్ని నెలల వరకు, తెలంగాణలో ఎలక్షన్ హడావుడి లేదు. బైపోల్స్ కూడా లేవు. అయినా, పార్టీని, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను ఒక సమరానికి సిద్దం చేస్తున్నట్టుగా అలజడి రేపుతున్నారు కేసీఆర్. మరేంటి ఆ యుద్ధం?

బీజేపీ మీద వార్‌కు క్యాడర్‌‌ను రెడీ చేస్తున్నారా? క్షేత్రస్థాయిలో కాషాయంపై తిరగబడాలని కర్తవ్యబోధ? భారతీయ జనతా పార్టీపై యుద్దం ఎప్పుడో ప్రారంభించారు సీఎం కేసీఆర్. హుజూరాబాద్‌‌లో బీజేపీ గెలిచిన మరుక్షణం నుంచే కాన్‌సన్‌ట్రేషన్‌ పెంచారు. ఇలాగే వదిలేస్తే, కాషాయదళం మరింతగా చెలరేగిపోతుందని భావిస్తున్న కేసీఆర్, ప్రజాక్షేత్రంలోనే కమలాన్ని తిప్పికొట్టాలని డిసైడయ్యారు. వరి ధాన్యం కొనుగోళ్లపై ఇఫ్పటికే ఆ పార్టీని ఇరుకునపెట్టిన కేసీఆర్, మరిన్ని అస్త్రాలతో విరుచుకుపడాలని పార్టీ నేతలకు స్పష్టం చేస్తున్నారు. విభజన హామీలు, ప్రాజెక్టులకు నిధులు, నీటి వాటాల తగువులు, సింగరేణి ప్రైవేటీకరణ, ధాన్యం కొనుగోళ్లు, ఇలా ఎన్నో అంశాల్లో రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందన్న అంశాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని పిలుపునిస్తున్నారు కేసీఆర్. ఈ రేంజ్‌లో పొలిటికల్ హడావుడికి శ్రీకారం చుట్టారు గులాబీ బాస్.

ఇవన్నీ సరే. కేసీఆర్‌ బిజీ షెడ్యూల్ సరే. మరి ఇఫ్పుడే ఎందుకు? రాబోయే మూడు నెలల్లో ఏదైనా రాజకీయ సంచలనానికి కేసీఆర్‌ తెరలేపుతున్నారా? తమిళనాడు పర్యటన తర్వాత ఒక్కసారిగా కారు గేరు ఎందుకు మార్చారు? రానున్న రోజులే ఇందుకు సమాధానం ఇవ్వబోతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories