వరుస సమీక్షలతో సీఎం కేసీఆర్‌ బిజీబిజీ.. ఈ నెల 17, 18, 19న వరుస భేటీలు

CM KCR‌ Busy with a Series of Reviews
x

వరుస సమీక్షలతో సీఎం కేసీఆర్‌ బిజీబిజీ.. ఈ నెల 17, 18, 19న వరుస భేటీలు

Highlights

CM KCR: ఈ నెల 17, 18, 19న వరుస భేటీలతో సీఎం కేసీఆర్‌ బిజి బిజీగా గడపనున్నారు.

CM KCR: ఈ నెల 17, 18, 19న వరుస భేటీలతో సీఎం కేసీఆర్‌ బిజి బిజీగా గడపనున్నారు. 17న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో సీఎం అధ్యక్షతన పార్టీ ప్రతినిధుల సమావేశం జరగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, డీసీఎంఎస్‌ అధ్యక్షులు, డీసీసీబీ అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఈ సమావేశానికి హాజరుకానుంది.

ఇక ఈ నెల 18న దళితబంధు, ఇతర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం నిర్వహించనున్నారు. సీఎస్‌ సోమేష్‌కుమార్‌తో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. మరోవైపు ఈ నెల 19న వనపర్తి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అనంతరం జగిత్యాల, జనగామ, నిజామాబాద్‌, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో కూడా సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories