Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ బిజీబిజీ

Delhi: *మూడు, నాలుగు రోజులు ఢిల్లీలోనే కేసీఆర్ మకాం *ధాన్యం కొనుగోళ్లపై మోడీ, పీయూష్‌ను కలిసే ఛాన్స్

Sriveni Erugu
Published on: 4 April 2022 9:28 AM IST
CM KCR‌ Busy  in Delhi
X

 Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ బిజీబిజీ

Delhi: కేంద్రంపై సీఎం కేసీఆర్‌ పోరుబాట పట్టారు. ధాన్యం కొనుగోళ్లపై తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. నేటి నుండి రాష్ట్రంలో టీఆర్ఎస్‌ ఆందోళనల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడు, నాలుగు రోజులపాటు హస్తినలోనే మకాం వేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఢిల్లీలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌లను కలవాలని భావిస్తున్నారు. అయితే వీరి అపాయింట్‌మెంట్‌లు దొరకకపోతే బీజేపీ యేతర పార్టీలతో ఈ అంశంపై మద్దతు కూడగట్టాలనుకుంటున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story