CM KCR: దళిత సాధికరత పథకానికి తెలంగాణ దళిత బంధు పథకం పేరు ఖరారు

* పైలెట్ ప్రాజెక్టు కింద హుజారాబాద్ నియోజకవర్గం ఎంపిక చేసిన సీఎం కేసీఆర్ * త్వరలో తేదీని ప్రకటించనున్న సీఎం కేసీఆర్

Sandeep Reddy
Updated on: 18 July 2021 9:15 PM IST
CM KCR Announced Telangana Dalitha Bandhu Pathakam in Huzurabad Constituency As A Pilot Project
X

సీఎం కేసీఆర్ (ఫైల్  ఫోటో)

KCR: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి "తెలంగాణ దళిత బంధు" అనే పేరు ఖరారు చేశారు సీఎం కేసీఆర్. మొదటగా పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ మొదలుకొని రైతు బీమా, రైతు బంధు పథకం వరకు కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించిన సీఎం కేసీఆర్ తాజాగా తెలంగాణ దళిత బంధు పథకాన్ని ఇదే జిల్లా నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఎప్పుడు ప్రారంభించే తేదీని త్వరలో ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్

Sandeep Reddy

Sandeep Reddy

Next Story