CM KCR: హాలియా, నందికొండ మున్సిపాల్టీలకు రూ.150 కోట్లు మంజూరు

CM KCR: నాగార్జునసాగర్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటనలో భాగంగా హాలియా, నందికొండ మున్సిపాల్టీలకు వరాల జల్లు కురిపించారు.

Arun Chilukuri
Updated on: 2 Aug 2021 3:03 PM IST
CM KCR  Announced Rs 150 Crore for Nagarjuna Sagar Constituency
X

CM KCR: హాలియా, నందికొండ మున్సిపాల్టీలకు రూ.150 కోట్లు మంజూరు

CM KCR: నాగార్జునసాగర్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటనలో భాగంగా హాలియా, నందికొండ మున్సిపాల్టీలకు వరాల జల్లు కురిపించారు. హాలియా, నందికొండ మున్సిపాల్టీల్లో అభివృద్ధి పనులకు మొత్తం 150 కోట్లు మంజూరు చేశారు సీఎం కేసీఆర్. హాలియాను అన్ని విధాలా అభివృద్ధి చేసి తీరుతామన్న కేసీఆర్‌ ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామన్నారు.

గుర్రంపోడు లిఫ్ట్‌ సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించామని, హాలియాలో డిగ్రీ కాలేజీతో పాటు మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. దళితబంధుపై అపోహలు సృష్టిస్తున్నారని, దళితబంధు మంచి పథకమన్న సీఎం పథకం కోసం లక్ష కోట్లు అయినా ఖర్చు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన దళితులందరికీ కుటుంబానికి 10లక్షలు చొప్పున అందిస్తామన్నారు సీఎం కేసీఆర్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story