CM KCR: రాబోయే రోజుల్లో రాజ్యం మనదే.. అన్ని రాష్ట్రాల్లో దళితబంధు అమలు చేస్తాం..

CM KCR: అంబేద్కర్‌ విశ్వమానవుడన్నారు సీఎం కేసీఆర్.

Arun Chilukuri
Published on: 14 April 2023 5:29 PM IST
CM KCR Addressing People After Unveiling the 125-foot-tall Statue of Dr BR Ambedkar
X

CM KCR: రాబోయే రోజుల్లో రాజ్యం మనదే.. అన్ని రాష్ట్రాల్లో దళితబంధు అమలు చేస్తాం..

CM KCR: అంబేద్కర్‌ విశ్వమానవుడన్నారు సీఎం కేసీఆర్. అణగారిన జాతులకు ఆశాజ్యోతి అయిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఎవరో డిమాండ్ చేస్తే ఏర్పాటు చేయలేదన్నారు. ఇది కేవలం విగ్రహం కాదు.. ఒక విప్లవమన్నారు. అంబేద్కర్‌ సిద్ధాంతం సార్వజనీనమైందని అందుకే సచివాలయానికి సైతం అంబేద్కర్‌ పేరే పెట్టుకున్నామని తెలిపారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలు కాదు.. ప్రజలు గెలిచే పరిస్థితి రావాలన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక దళితుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు దళితుల అభ్యున్నతిని పట్టించుకోలేదని విమర్శించారు. దేశంలో రాబోయే ఎన్నికల్లో రాజ్యం మనదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లో దళితబంధు అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story