CM KCR: చేనేత కార్మికులకు కూడా బీమా అందిస్తాం

CM KCR About Telangana Weavers Chenetha Bheema Scheme
x

CM KCR: చేనేత కార్మికులకు కూడా బీమా అందిస్తాం

Highlights

CM KCR: తెలంగాణ ఒక ధనిక రాష్ట్రామని సీఎం కేసీఆర్ అన్నారు.

CM KCR: తెలంగాణ ఒక ధనిక రాష్ట్రామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణకు కంపెనీలు వెల్లువలా వస్తున్నాయని వివరించారు. భవిష్యత్‌లో మరిన్న పరిశ్రమలు కూడా వస్తాయని అన్నారు. మెరుగైన తలసరి ఆదాయాన్ని సాధించుకుంటున్నామని సీఎం గుర్తుచేశారు.

బలహీన వర్గాలను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టామని సీఎం కేసీఆర్ అన్నారు. గీతకార్మికులు, చేనేత కార్మికులు, గొర్ల కాపరులు, నాయీ బ్రహ్మాణులు, రజక ఇలా అందరికీ సాయం అందేలా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు కేసీఆర్ గుర్తుచేశారు.

చేనేత కార్మికులకు కూడా రైతు బీమా తరహాలో బీమా వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. చేనేత శాఖ అధికారులు బీమా వర్తింపు సిస్టమ్‌ను డెవలప్‌ చేస్తున్నారని కేసీఆర్ తెలిపారు. త్వరలో రైతులకు వర్తించినట్లే చేనేత కార్మికులకు కూడా బీమా వస్తుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories