సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ

X
Highlights
సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను మొదట్లో...
Arun Chilukuri13 Jan 2021 2:59 PM GMT
సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను మొదట్లో వ్యతిరేకించిన సీఎం కేసీఆర్.. ఢిల్లీ వెళ్లొచ్చాక యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. విద్యుత్ చట్టాలపై చేసిన విధంగా సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని లేఖలో తెలిపారు. సీఎం తన వ్యక్తిగత అవసరాల కోసం అన్నదాతల భవిష్యత్‌ను తాకట్టు పెట్టడం సరికాదని హితవు పలికారు. సాగు చట్టాలను కేంద్రం ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని భట్టి విజ్ఞప్తి చేశారు.
Web TitleCLP Leader Bhatti Vikramarka Write Letter To CM KCR On New Farm Laws
Next Story