Telangana: పెండింగ్‌ రేషన్‌ కార్డులకు మోక్షం

రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న వాటిని వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Venkata Chari
Updated on: 8 Jun 2021 9:30 PM IST
Clear all Pending Ration Card Applications
X

రేషన్ కార్డు (ఫొటో ట్విట్టర్)

Telangana: రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న వాటిని వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఈరోజు జరిగిన కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలో దాదాపు 4,46,169 మంది కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారు. ఎప్పటి నుంచో ఇవి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈమేరకు నేడు ప్రభుత్వ వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని క్యాబినెట్ సంబంధిత అధికారులను ఆదేశించింది.

Venkata Chari

Venkata Chari

Next Story