10th Exams : నేటి నుంచి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ..విద్యార్థులు ఇవి పాటించాల్సిందే

10th Exams : నేటి నుంచి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ..విద్యార్థులు ఇవి పాటించాల్సిందే
x
Highlights

10th Exams : నేటి నుంచి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. విద్యార్థులకు సీఎం రేవంత్...

10th Exams : నేటి నుంచి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా కాన్పిడెంట్ తో ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆయన కోరారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి సమస్య రాకుండా అన్ని చెక్ చేశారు.

తెలంగాణలో 11,547 పాఠశాలల్లో చదువుతున్న 5,09,403మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. వీరిలో 2,58,895 మంది అబ్యాయిలు, 2,50,508 మంది అమ్మాయిలు ఉన్నారు. అధికారులు కూడా మొత్తం 2,650 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందువల్ల ఎలాంటి సమస్యలు ఉండవని తెలిపారు. పరీక్షల నిర్వహణ సజావుగా ఉండేందుకు ప్రభుత్వం పరీక్షల విభాగం కార్యాలయంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు, సమస్యలు ఉంటే 040-23230942 నెంబర్ కు కాల్ చేసి అడగవచ్చని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories