టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ ఎదుటే కొట్లాటకు దిగిన కార్యకర్తలు

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ ఎదుటే కొట్లాటకు దిగిన కార్యకర్తలు
x

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ ఎదుటే కొట్లాటకు దిగిన కార్యకర్తలు

Highlights

మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో విభేదాలు బయటపడ్డాయి. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న నేతలు పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఎదుటే ఘర్షణకు దిగారు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు...

మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో విభేదాలు బయటపడ్డాయి. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న నేతలు పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఎదుటే ఘర్షణకు దిగారు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్తి గార్డెన్స్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో నేతలు కొట్లాటకు దిగారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ముందే డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన రాంచంద్రు నాయక్ వర్సెస్ నెహ్రూ నాయక్ వర్గాలు ఘర్షణకు దిగారు. మరోవైపు మహబూబాబాద్ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ మురళీ నాయక్ వర్సెస్ బలరాం నాయక్ వర్గీయులు మధ్య ఘర్షణ జరిగింది. ఉత్తమ్ జోక్యం చేసుకున్నా కార్యకర్తలు తగ్గలేదు.. సుమారు 20 నిమిషాల పాటు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories