Revanth Reddy: పోలీసులకు ఎంపీ రేవంత్‌ రెడ్డికి మధ్య వాగ్వాదం

Revanth Reddy: పేదలకోసం అన్నదానం చేసేందుకు వెళ్తున్న రేవంత్‌ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

Sandeep Eggoju
Updated on: 16 May 2021 2:31 PM IST
Clashes Between Police and Congress MP Revanth Reddy
X

రేవంత్ రెడ్డి మరియు పోలిసుల మధ్య వాగ్వాదం (ఫైల్ ఇమేజ్)

Revanth Reddy: పోలీసులకు కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. గాంధీ ఆస్పత్రి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పేదల కోసం అన్నదానం చేసేందుకు వేళ్తున్న రేవంత్‌ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి కేటీఆర్‌ నుంచి తమకు ఆదేశాలు ఉన్నాయని రేవంత్‌ రెడ్డి వాహనం ముందుకు వెళ్లకుండా రౌండప్‌ చేశారు. దీంతో ప్రభుత్వంపై, పోలీసుల తీరుపై రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నుంచి వచ్చిన రాతపూర్వక ఆదేశాలను చూపాలని రేవంత్ రెడ్డి డిమాండ్‌ చేశారు. పేదల ఆకలితో రాజకీయాలు చేస్తారా..? అని ప్రశ్నించారు. లాక్‌డౌన్‌లో పేదలకు అన్నం పెట్టడం నేరమా..? అని నిలదీశారు. నేనే స్థానిక ఎంపీని నన్ను అడ్డుకోమనే అధికారం ఎవరిచ్చారని ధ్వజమెత్తారు. సామాజిక సేవలో రాజకీయాలు వెతికే ప్రయత్నం దుర్మార్గమని మండిపడ్దారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story