Adilabad: గుండాలలో తీవ్ర ఉద్రిక్తత.. ఇద్దరు మృతి

Adilabad: అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండాలలో ఉద్రిక్తత నెలకొంది.

Arun Chilukuri
Updated on: 27 Oct 2021 8:15 PM IST
Clash Between two Groups in Gundala Village 2 Dead, 26 Injured
X

Adilabad: గుండాలలో తీవ్ర ఉద్రిక్తత.. ఇద్దరు మృతి

Adilabad: అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండాలలో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. కర్రలు, రాళ్లతో రెండు గ్రూపులు కొట్టుకున్నాయి. ఘర్షణలో ఇద్దరు మృతి చెందారు పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాడిలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. గ్రామాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎస్పీ రాజేష్‌ చంద్ర గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయితే గ్రామంలోకి ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు గ్రామస్తులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story