బైంసాలో ఉద్రిక్తత.. జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత !

బైంసాలో ఉద్రిక్తత.. జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత !
x
Highlights

నిర్మల్ జిల్లా భైంసాలో ఉద్రికత నెలకొన్నది. రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలురికి గాయాలయ్యాయి. రెచ్చిపోయిన ఇరువర్గాల వారు ఇళ్లు, వాహనాలకు...

నిర్మల్ జిల్లా భైంసాలో ఉద్రికత నెలకొన్నది. రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలురికి గాయాలయ్యాయి. రెచ్చిపోయిన ఇరువర్గాల వారు ఇళ్లు, వాహనాలకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. సీఐ, వేణుగోపాలరావు, డీఎస్పీ నర్సింగరావు సహా ఇతర పోలీసు సిబ్బందికి గాయపడ్డారు.

జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడులకు పాల్పడిన వారిని గుర్తించడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఇద్దరు ఐజీలు, ముగ్గురు కమిషనర్లు, ముగ్గురు ఎస్పీలు సహా నాలుగు వందల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ సేవలు నిలిపివేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories