కరీంనగర్‌లో ఉద్రిక్తత : కొట్టుకున్న టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు

Arun Chilukuri
Published on: 24 Jan 2021 1:35 PM IST
కరీంనగర్‌లో ఉద్రిక్తత : కొట్టుకున్న టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు
X

కరీంనగర్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కరీంనగర్‌లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడికి దిగారు. ముఖ్యమంత్రిపై బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ సంజయ్ దిష్టి బొమ్మ దహనం కార్యక్రమం చేపట్టింది. విషయం తెలిసిన బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణగా మారి ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ గొడవను ఆపేందుకు ప్రయత్నించిన కరీంనగర్ టూ టౌన్ సీఐ అక్ష్మీబాబు తోపులాటలో కిందపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు గాయపడినట్లుగా సమాచారం. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story