పాలకవీడు డెక్కన్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత.. ఎస్సై, కానిస్టేబుళ్లకు గాయాలు

సూర్యాపేట జిల్లా పాలకీడులోని డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Arun Chilukuri
Updated on: 22 Sept 2025 5:10 PM IST
పాలకవీడు డెక్కన్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత.. ఎస్సై, కానిస్టేబుళ్లకు గాయాలు
X

సూర్యాపేట జిల్లా పాలకీడులోని డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల ఫ్యాక్టరీలో మృతి చెందిన ఒక కార్మికుడికి నష్టపరిహారం చెల్లించాలంటూ బీహార్‌ కూలీలు దాడికి దిగారు. ఈ దాడిలో ఫ్యాక్టరీ అద్దాలు, ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమయ్యాయి.​ సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులను కూడా బీహార్ కూలీలు అడ్డుకున్నారు. పోలీసు వాహనంపై రాళ్లు రువ్వి దాడి చేశారు, దీంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది.

ఈ ఘటనలో ఎస్సై, ఒక హోంగార్డుకు స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కూలీలపై లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story