CJI NV Ramana: నేడు యాదాద్రికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

CJI NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా నేడు యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు.

Kranthi
Published on: 15 Jun 2021 6:55 AM IST
CJI NV Ramana to Visit Yadadri Temple on Today
X

CJI NV Ramana:(File Image)

CJI NV Ramana: నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఉదయం7గంటలకు హైదరాబాద్‌ నుంచి ప్రారంభమై, రోడ్డు మార్గం ద్వారా ఉదయం 8.30నిమిషాలకు యాదాద్రి చేరుకుంటారు. ఇక, గుట్ట మీద కొత్తగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహానికి ఎన్వీ రమణ నేరుగా చేరుకోనున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకోనున్నారు. 9గంటల 15నిమిషాలకు ఆల‌య పున‌ర్ నిర్మాణ పనులను ప‌రిశీలించ‌నున్నారు. 10 గంటలకు తిరుగు ప్రయాణం కానున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్వర్ రెడ్డిలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు ఘనస్వాగతం పలకనున్నారు. వారితో పాటు యాదగిరిగుట్ట పర్యటనలో పాల్గొంటారు. ఎన్వీ రమణ తో పాటు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళసై పాల్గొనాల్సి వుంది. అనివార్య కారణాల వల్ల వారి పర్యటన రద్దు అయ్యింది.

Kranthi

Kranthi

Next Story