MP Raghu Rama: ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌

Raghu Rama Krishna Raju: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు

Samba Siva Rao
Updated on: 14 May 2021 5:28 PM IST
MP  Raghu Rama: ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌
X

Raghu Rama Krishna Raju: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని రఘురామకృష్ణంరాజు ఇంటికి వెళ్లిన ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులిచ్చి అదుపులోకి తీసుకున్నారు. రఘురామకృష్ణంరాజుపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసేందుకు చాలారోజులుగా ప్రయత్నిస్తున్నారు. అయితే, తన బర్త్‌‌డే సెలబ్రేషన్స్‌ కోసం రఘురామకృష్ణంరాజు హైదరాబాద్ వచ్చినట్లు తెలుసుకున్న ఏపీ సీఐడీ పోలీసులు ఆగమేఘాలపై వచ్చి అదుపులోకి తీసుకున్నారు.

ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. అయితే మొదట్లో వారిని సీఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు. తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు ఒప్పుకుంటామని సీఆర్పీఎఫ్ పోలీసులు తేల్చి చెప్పారు. గత కొంతకాలంగా ఏపీ సర్కార్‌పై రఘురామ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story