Fake Passports: నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ జారీ కేసులో దర్యాప్తు ముమ్మరం

Cid Arrests Gang Of 12 For Running Fake Passport Racket In Telangana
x

Fake Passports: నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ జారీ కేసులో దర్యాప్తు ముమ్మరం

Highlights

Fake Passports: పోలీస్ అధికారుల ప్రమేయంపై సీఐడీ అధికారుల ఆరా

Fake Passports: నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్ జారీ కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 12 మంది నిందితులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. 6 జిల్లాల్లో పాస్‌పోర్ట్ బ్రోకర్‌ని సీఐడీ అరెస్ట్ చేసింది. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా పాస్‌పోర్ట్ పొందినట్లు సీఐడీ గుర్తించింది. కొందరు విదేశీయులకు సైతం నకిలీ పాస్‌పోర్ట్ ఇప్పించినట్లు అధికారులు గుర్తించారు.

నకిలీ పాస్‌పోర్ట్‌లతో కొంత మందికి వీసాలను జారీ చేశారు. వీసాల్లో కెనెడా, స్పెయిన్ దేశాల వీసాలు మంజూరు కావడంపై సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. నకిలీ పాస్‌పోర్ట్‌లు ఇప్పించడంలో కొంతమంది పోలీస్ అధికారుల హస్తమున్నట్టు విచారణలో వెల్లడైంది. పోలీస్ అధికారుల ప్రమేయంపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. పలువురు పాస్‌పోర్ట్ సిబ్బంది పాత్రపై దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories